ఎవరి ధీమా వారిదే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పురపాలక ఎన్నికలు ముగిశాయి. బుధవారం పోలింగ్ జరగగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గెలుపోటములపై కార్పొరేటర్/కౌన్సిలర్ అభ్యర్థులు, రాజకీయ పక్షాలతో పాటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు ఆయా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు గురువారం డివిజన్ల వారీగా అభ్యర్థులు, ముఖ్య నాయకులతో కలిసి గెలుపోటలములపై అంచనాలు వేశారు. ప్రచారం, పోలింగ్ రోజున కలిసి వచ్చినవి, ఏయే డివిజన్లలో వెనుకబడ్డాం వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ ఫలితాలు ఎలా వస్తాయనే లెక్కల్లో మునిగారు.
ఎగ్జిట్ పోల్స్, సర్వే అంచనాలతో..
పోలింగ్ అనంతరం విడుదలైన పలె ఎగ్జిట్ పోల్స్‌తో పాటు ఆయా పార్టీలు స్వయంగా చేయించుకున్న సర్వేల ఫలితాలను విశ్లేషిస్తూ లెక్కలు కట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో ఒకటి (కాంగ్రెస్) ఏకగ్రీవం పోనూ 59 డివిజన్లపై అధికార కాంగ్రెస్ నేతలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ మెజార్టీ సీట్లు తమకే వస్తాయని.. దీంతో పాటు జిల్లాలోని దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు తమవేనని ఆ పార్టీ ముఖ్య నేతలు ఆశాభావంతో ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత కార్పొరేషన్ పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలు.. గెలుస్తామనుకున్న చోట మారిన తీరుపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు డివిజన్ల వారీగా విళ్లేషించినట్లు సమాచారం. జిల్లాలోని మూడు పురపాలికల్లోనూ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్‌ఎస్, సత్తా చాటుతామని బీజేపీ ముఖ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మెజార్టీ మాదే..
మహబూబ్‌నగర్‌లోని కార్పొరేషన్‌తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల్లో మెజార్టీ మాదే. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు అత్యం ప్రాధాన్యం ఇవ్వడం.. వందలాది కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం కలిసి వస్తుంది.
– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
– జి.మధుసూదన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
ఎవరి ధీమా వారిదే..!


