కదం తొక్కిన కార్మిక లోకం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కేంద్రప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు కదం తొక్కారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా జిల్లాకేంద్రంలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సభ నిర్వహించిన అనంతరం ర్యాలీగా తెలంగాణ చౌరస్తాకు చేరుకొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోడ్లు తెచ్చి కార్మికవర్గంపై యుద్ధం చేస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభు త్వం వ్యవసాయ, పారిశ్రామిక రంగాన్ని దివాలా తీయించడానికి, కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి కుట్రలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు, బ్యాంకులను కుదించడం, బీమా రంగంలో విదేశీ బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించి దేశ సంపాదనను విదేశాలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, 8 గంటల పనిని పెంచడం, కనీస వేతనాలు లేకుండా యాజమాన్యాలు మోసం చేస్తున్నాయన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, వివిధ సంఘాల నాయకు లు వెంకటేష్, జెట్టి రాజేష్, ఎన్.కిష్టయ్య, సి.కృష్ణయ్య, రాజేశ్వర్, కలమంద రామదాస్, విజయవర్ధన్ రాజు, పద్మ, యాదమ్మ, కడియాల మోహన్, మన్యం, వెంకట్ రాములు, కురుమయ్య, మారుతి, తిరుమల్‌రెడ్డి, కమర్ అలీ, బి.చంద్రకాంత్, రాజ్ కుమార్, సంతోష్, నవీన్ సాగర్ పాల్గొన్నారు.


