నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ

Feb 10 2026 7:58 AM | Updated on Feb 10 2026 7:58 AM

నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ

నిష్పక్షపాతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ

కలెక్టర్‌ విజయేందిర బోయి

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయేందిర బోయి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొ ని మాట్లాడారు. ఈనెల 11వ తేదీన మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌, భూత్పూర్‌, దేవరకద్ర మున్సిపాలిటీల్లో ఎన్నికల ఓటింగ్‌ పూర్తయిన తర్వాత 13వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు విధానాలపై కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపును విశ్వసనీయంగా నిర్వహించడంలో రిటర్నింగ్‌ అధికారులు కౌంటింగ్‌ సిబ్బందికి సరైన మార్గదర్శకం చేయాలన్నారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, రిటర్నింగ్‌ అధికారులు నిష్పక్షపాతంగా అత్యంత జాగ్రత్తతో ఎన్నికల విధివిధానాలను పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఒకవేళ రీకౌంటింగ్‌కు ఏవైనా అభ్యర్థనలు వస్తే వాటిని రాతపూర్వకంగా స్వీకరించాలని తెలిపారు. రీకౌంటింగ్‌ను ఆమోదించాలా, తిరస్కరించాలా అ నేది రిటర్నింగ్‌ అధికారి విచక్షణ ఆధారంగా నిర్ణ యం తీసుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రా ల్లో రిటర్నింగ్‌ అధికారికి తప్పా.. ఇతరులకు మొబై ల్‌ ఫోన్లు అనుమతించరాదని సూచించారు. కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులకు ఓటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేస్తున్న విధానాన్ని చూపించాలన్నారు. ప్రతిరౌండ్‌ లెక్కింపు పూర్తవగానే కౌంటింగ్‌ ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, లెక్కింపు అనంతరం అభ్యర్థుల ఎన్నికల ఫలితాలు, జిల్లా ఎన్నికల అధికారుల అనుమతితోనే ప్రకటించాలని సూచించారు. ఒకవేళ పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే డ్రా ద్వారా ఫలితాలను నిర్ణయించాలని సూచించారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి మాట్లాడుతూ.. రికౌంటింగ్‌ విషయంలో సందేహాలుంటే రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నియమావళిలో సూచించిన మార్గదర్శకాలను పాటించి నిర్ణ యం తీసుకోవాలన్నారు. లెక్కింపులో లోటుపాట్ల కు తావివ్వకుండా వ్యవహరించాలని, చేయాల్సిన పనులను మాక్‌ శిక్షణ ద్వారా కౌంటింగ్‌ సిబ్బందికి చూపించారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, తర్వాత బ్యాలెట్‌ బాక్సులోని ఓట్లను లెక్కించాలన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ అకౌంట్‌, పీఓ డైరీ, పేపర్‌ సీల్‌ అకౌంట్‌, విసిట్‌ షీట్‌ను ఓట్ల లెక్కింపు సమయంలో తప్పకుండా పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, మధుసూదన్‌నాయక్‌, ఆర్డీఓ నవీన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామిరెడ్డి, ఇన్‌చార్జి జిల్లా పంచాయతీ అధికారి వెంకట్‌రెడ్డి, డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, సీఎంఓ సుధాకర్‌రెడ్డి, మాస్టర్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement