ఎంఐఎం డీలా.. | - | Sakshi
Sakshi News home page

ఎంఐఎం డీలా..

Feb 16 2026 8:35 AM | Updated on Feb 16 2026 8:35 AM

ఎంఐఎం డీలా..

ఎంఐఎం డీలా..

పాలమూరు: నూతనంగా ఏర్పాటైన మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్‌ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. నగరంలో 60 డివిజన్లు ఉండగా 16 డివిజన్లలో మాత్రమే పోటీ చేసి కేవలం మూడు స్థానాలకే పరిమితం కావడంపై ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీకి సంబంధించిన అధినేతలు అసదుద్దీన్‌ ఓవైసీతో పాటు అక్బరుద్దీన్‌ ఓవైసీలతో ప్రచారసభలు ఏర్పాటు చేశారు. ఎంఐఎంకు పట్టున్న డివిజన్లలో ఇతర పార్టీలకు దీటుగా ప్రచారం చేసినా ఆశించిన ఫలితం రాలేదు. పలువురు తాజా మాజీ కార్పొరేటర్లు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలుపొందారు. ఈ సారి ఒక స్థానం పడిపోయి మూడు స్థానాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం గెలుపొందిన వారిలో 50 డివిజన్‌ కార్పొరేటర్‌ అబ్దుల్‌ ముస్తాక్‌ రషీద్‌ వరుసగా మూడోసారి గెలిచారు. మిగిలిన 34వ డివిజన్‌, 14వ డివిజన్‌లో ఇద్దరూ కొత్తగా గెలుపొందారు. అయితే ఆరు డివిజన్లలో ఎంఐఎం రెండో స్థానాల్లో రావడం విశేషం.

మూడు స్థానాలకే

పరిమితమైన మజ్లిస్‌ పార్టీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement