జేఈఈలో రిషి ఉత్తమ ఫలితాలు
పాలమూరు: ఇటీవల విడుదలైన జేఈఈ ఫలితాల్లో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని కళాశాల ఛైర్ పర్సన్ చంద్రకళ వెంకట్ వెల్లడించారు. జేఈఈ–2025 ఫలితాల్లో రిషి విద్యార్థుల్లో నరహరి 98.21, సయ్యద్ మిస్బావుద్దీన్ 97.37, జ్యోతిర్నాథ్ 96.58, కిశోర్‌కుమార్ 95.50, కోటేశ్వర్ 95.08 ర్యాంకు సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది. ప్రతిఏడాది మెడికల్‌లోనే కాకుండా జేఈఈ ఫలితాల్లో కూడా అత్యుత్తమ మార్కులు సాధిస్తూ పాలమూరులో కార్పొరేట్ విద్య అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డీన్ భూపాల్‌రెడ్డి, ఐఐటీ అకాడమీ డీన్ కల్యాణ్‌బాబు, అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
కిషోర్‌కుమార్
సయ్యద్
జ్యోతిర్నాథ్
నరహరి
కోటేశ్వర్
జేఈఈలో రిషి ఉత్తమ ఫలితాలు
జేఈఈలో రిషి ఉత్తమ ఫలితాలు
జేఈఈలో రిషి ఉత్తమ ఫలితాలు
జేఈఈలో రిషి ఉత్తమ ఫలితాలు


