మక్తల్ ఘటనతో కలకలం..
మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకా మక్తల్ మున్సిపాలిటీలోని ఆరోవార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ వార్డులో బీఆర్‌ఎస్‌కు చెందిన మొగిలప్ప, శివరాజ్.. కాంగ్రెస్ నుంచి మారెప్ప.. బీజేపీ నుంచి మహదేవప్ప నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో శివరాజ్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఈ వార్డులో ముగ్గురు బరిలో నిలవగా.. ఎవరికి వారు విస్తృత ప్రచారం చేశారు. ఈ క్రమంలో పోలింగ్‌కు ముందు రోజు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అధికార నేతలు బెదిరింపులకు గురిచేయడంతోనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన భార్య సత్తెమ్మ ఆరోపించడంతో కలకలం రేగింది. ఆరో వార్డులో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న మారెప్ప, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న మహదేవప్ప అన్నదమ్ముల పిల్లలు. ఇరువురి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. ఇరువురు కుటుంబాల మధ్య ఎలాంటి తగాదాలు లేవని గ్రామస్తులు చెబుతుండగా.. విచారణ తర్వాతే నిజాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.


