నేడు ‘విద్యుత్‌’ ఫోరం సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు ‘విద్యుత్‌’ ఫోరం సమావేశం

Feb 19 2026 9:36 AM | Updated on Feb 19 2026 9:36 AM

నేడు ‘విద్యుత్‌’ ఫోరం సమావేశం

నేడు ‘విద్యుత్‌’ ఫోరం సమావేశం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లా కేంద్రంలోని విద్యుత్‌భవన్‌లోని సమావేశం మందిరంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్‌ వినియోగదారుల ఫోరం సమావేశం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ బీమానాయక్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు తమ ఆధార్‌ జిరాక్స్‌, కరెంట్‌బిల్లు, వ్యవసాయ సంబంధిత ఫిర్యాదుదారులు పట్టా పాస్‌బుక్‌ జిరాక్స్‌ కూడా తీసుకురావాలని సూచించారు. వినియోగదారుల ఫోరం చైర్మన్‌ రామాంజనాయక్‌, ఇండిపెండెంట్‌ సభ్యుడు వెంకట్‌ హాజరవుతున్నారని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నక్ష సర్వేను వేగవంతంగా పూర్తి చేయండి

జడ్చర్ల: మున్సిపాలిటీలో నక్ష సర్వేను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జడ్చర్లలో నక్ష సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు. పట్టణంలో 202 బ్లాకులుంటే 22 బ్లాక్స్‌లో సర్వే కొనసాగుతోందని అధికారులు వివరించారు. మొత్తం 18,679 ప్రాపర్టీస్‌ ఉండగా 2192 ప్రాపర్టీస్‌ గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తవగా 1,426 ప్రాపర్టీస్‌ డిజిటలైజేషన్‌ పూర్తయినట్లు తెలిపారు. మిగతా వార్డులలో నక్ష కొనసాగుతుందన్నారు. అంతకుముందు జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో అదనపు కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఎస్‌ఐఆర్‌–2025 మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎల్‌ఓలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. భూభారతి సమస్యలతో పాటు ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ నర్సింగరావు, డీటీ మాధవి, తదితరులు పాల్గొన్నారు.

అద్దె ప్రాతిపదికనఆర్టీసీ బస్సులు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: రానున్న పెళ్లిళ్లు, శుభాకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ సంతో ష్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రీజియన్‌లోని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్‌ వాహనాల కంటే తక్కువ ధర ఉంటుందని, డ్రైవర్‌ బత్తా కట్టనవసరం లేదని, సౌకర్యవంతమైన బీఎస్‌6 అధునాతన టెక్నాలజీ కొత్త బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సులను బుకింగ్‌ చేసుకునేందుకు అచ్చంపేట 99592 26291, గద్వాల 99592 26290, కల్వకుర్తి 99592 26292, కొల్లాపూర్‌ 90004 05878, కోస్గి 99592 26293, మహబూబ్‌నగర్‌ 99592 26286, నాగర్‌కర్నూల్‌ 99592 26288, నారాయణపేట 99592 26293, మహబూబ్‌నగర్‌ 99592 26286, షాద్‌నగర్‌ 99592 26287, వనపర్తి 99592 26289 నంబర్లను సంప్రదించాలని కోరారు.

పీయూలో ప్రాంగణ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఫార్మసీ, ఎంబీఏ విద్యార్థుల కోసం ఆమ్నీల్‌ ఆంకాలజీ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. 80 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ మధుసూదన్‌రెడ్డి, రవికాంత్‌, అర్జున్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అనాథ పిల్లలకు 40క్వింటాళ్ల బియ్యం అందజేత

దేవరకద్ర మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి

– వివరాలు 8లో..

ప్రతి విద్యార్థి లక్ష్యం నిర్దేశించుకోవాలి

గ్రూప్‌–1 శిక్షణ అధికారుల క్షేత్ర పర్యటన

యాంత్రీకరణతో రైతులకు వరం

– వివరాలు 9లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement