పునరావాస కష్టాలు?
రిజర్వాయర్ల నిర్మాణం కోసం వందలాది ఎకరాల భూమిని త్యాగం చేశారు. పుట్టి పెరిగిన గ్రామంతో తెగతెంపులు చేసుకుని పిల్లాపాపలతో పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు సిద్ధపడ్డాయి. కానీ వారికి ఆర్‌అండ్‌ఆర్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో ముంపు ప్రాంతాల్లోనే గడుపుతున్నారు. భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లలో సర్వం కోల్పోయిన నిర్వాసితులు దాదాపు దశాబ్దన్నరగా అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలంలో ఊటనీరు వచ్చి.. ఇళ్లు కూలిపోతున్నా.. బిక్కుబిక్కుమంటూ అక్కడే గడుపుతున్నారు. – మక్తల్
సంగంబండ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నెరెడుగాం
భూత్పూర్, నెరెడుగాం ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ల ఏర్పాటు పట్టని ప్రభుత్వం


