చెరువులో మొసలి కలకలం
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురం గ్రామ శివారులో ఉన్న చెరువులో ఆదివారం మొసలి కనబడడం కలకలం రేపింది. పొలాల వద్దకు వెళ్లిన రైతులకు చెరువు గడ్డపై సేదతీరుతున్న మొసలి కనబడింది. దీంతో మొసలి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అటవీశాఖ అధికారులు గమనించి మొసలిని పట్టుకొని వేరే చోటికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తనువు చాలించి..
మరొకరి చూపునిచ్చి..
నర్వ: 65 ఏళ్ల వయస్సులో మరణాంతరం మరొకరికి చూపినిచ్చి ఆదర్శంగా నిలిచారు పాతర్చేడ్ గ్రామానికి చెందిన పులుసు అమ్మక్క. రెడ్‌క్రాస్ జూనియర్ కోఆర్డినేటర్ కందుకూరి అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి అక్మమ్మ మరణాంతరం కుమారులు నర్సిములు, రమేష్ సూచన మేరకు ఆమె కళ్లను ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ ల్యాబ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ నేత్రదానం చేయడం వల్ల ఇద్దరు వ్యక్తులకు ప్రపంచాన్ని చూసే అదృష్టం కల్పించినట్లయిందన్నారు. అమ్మక్క కుమారులు రమేష్, నర్సిములను క్లబ్ సభ్యులు, వైద్యులు, గ్రామస్తులు అభినందించారు.
చెరువులో మొసలి కలకలం
చెరువులో మొసలి కలకలం
చెరువులో మొసలి కలకలం


