కార్పొరేటర్ల ప్రమాణస్వీకరానికి భారీ భద్రత
మహబూబ్‌నగర్ క్రైం: మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్‌ఎన్నిక సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ డి.జానకి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దగ్గర ఉండి బందోబస్తుతో పాటు కార్పొరేషన్‌లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బలగాలు ప్రధాన ముఖద్వారం దగ్గర ప్రత్యేక రోప్‌పార్టీలు ఉండి బందోబస్తు నిర్వహించారు. అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల బస్సు శంషాబాద్ నుంచి ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చింది. ఈ క్రమంలో బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి అనుమతి ఇవ్వకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కౌన్సిల్ హాల్‌లోకి కేవలం అభ్యర్థులు, అధికారులను మాత్రమే అనుమతించారు.మీడియాను సైతం బయటనే ఉంచి ఒక స్క్రీన్ ద్వారా కౌన్సిల్ లోపల జరిగే దృశ్యాలను లైవ్ ద్వారా చూపించారు. మొదట డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఒంటరిగా వచ్చి సీల్డ్ కవర్‌తో పాటు విప్ జారీ ఇచ్చి వెళ్లాడు. రెండు గంటల్లో ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాక్‌టవర్ నుంచి అశోక్ టాకీస్ వెళ్లే ట్రాఫిక్‌ను పూర్తిగా ఇతర మార్గాల్లో మళ్లించరు.
న్యాయవాదులపై పెరిగిపోతున్న దాడులు
పాలమూరు: రాష్ట్రంలో న్యాయవాదులపై రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయని కట్టడి కోసం రక్షణ చట్టం ఒకటే మార్గం అని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. న్యాయవాదులపై కొనసాగుతున్న దాడులు, హత్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. రంగారెడ్డి కోర్టులో న్యాయవాది మహ్మద్ ఖదీర్ హత్యను నిరసిస్తూ సోమవారం కోర్టు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే న్యాయవాదులపై దాడులు అధికంగా పెరిగిపోయాయని, ఇలాంటి ఘటనలు అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్‌రావు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
కార్పొరేటర్ల ప్రమాణస్వీకరానికి భారీ భద్రత


