ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలో విస్తుపోయే నిజాలు
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని క్లబ్‌రోడ్డులో ఉన్న ఏకే ఫుడ్‌కోర్టులో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలో విస్తుపోయిన నిజాలు వెలుగు చూశాయి. పాడైపోయిన, కల్తీ మసాలాలు, శుభ్రత పాటించకపోవటాన్ని ఆమె గుర్తించారు. పురుగులు పట్టిన బిర్యానీని గుర్తించి దానిని తొలగింపజేశారు. ఫుడ్‌కోర్టు ఇలా ఉంటే ఎలా అంటూ నిర్వాహకులపై మండిపడ్డారు. నాణ్యత పాటించకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కిచెన్ పరిశుభ్రంగా ఉంచాలని, తినుబండారాల్లో ఎలాంటి కల్తీ ఉండరాదని హెచ్చరించారు. అంతకుముందు ఆరాధ్య మార్ట్‌లో షాంపిల్స్ కలెక్ట్ చేశారు. తనిఖీల సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం తినుబండారాల నాణ్యతపై తనిఖీలు ఉన్నాయని, అందులో భాగంగానే జడ్చర్లలో పర్యటించినట్లు వెల్లడించారు. ఏకే ఫుడ్ కోర్టుపై తమకు ఇదివరకే ఫిర్యాదులు అందినందున తనిఖీ చేసినట్లు వెల్లడించారు. పరిశుభ్రత లోపించటం, పురుగులు పట్టిన మసాలాలు సేకరించామని వెల్లడించారు. తనిఖీ సందర్భంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఆమె వెంట ఆఫీస్ అసిస్టెంట్ వాజిద్ ఉన్నారు.
మనస్తాపంతో
యువతి బలవన్మరణం
కేటీదొడ్డి: ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన మండలంలోని చోటు చే సుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసులు, కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాలు.. మండలంలోని చింతలకుంట గ్రామానికి చెందిన స్నేహ (20) కేటీదొడ్డి గ్రామానికి చెందిన యువకుడికి 40 రోజుల క్రితం పెళ్లి కుదిరింది. అయితే కొన్ని రోజుల నుంచి అనుమానంతో ఆ యువకుడి వేధింపులకు గురిచేయడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు రాయిచూర్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పెళ్లి నిశ్చయం అయిన యువకుడికి గతంలోనే పెళ్లి కాగా.. ఎనిమిది నెలల క్రితం మొదటి భార్య వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుందని గ్రామంలో చర్చనీయంగా మారిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతురాలి తల్లి మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
డ్రంకెన్‌డ్రైవ్‌లో
నిందితులకు జైలుశిక్ష
వెల్దండ: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ వద్ద డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలో పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామానికి చెందిన మహ్మద్‌ఖాసీం పట్టుపడ్డాడు. నిందితుడిని బుధవారం కల్వకుర్తి కోర్టులో హాజరుపర్చగా జడ్జి జాడకావ్య 3 రోజుల జైలుశిక్షతో పాటు రూ.600జరిమానా విధించినట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.
ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలో విస్తుపోయే నిజాలు


