హోరాహోరీగా ఎస్‌జీఎఫ్ క్రికెట్ టోర్నీ
జడ్చర్ల టౌన్: బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, స్వామి నారాయణ గురుకుల మైదానాల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలుర క్రికెట్ టోర్నీలో మహబూబ్‌నగర్, ఖమ్మం జట్లు సెమీస్‌కు చేరాయి. హోరాహోరీగా కొనసాగుతున్న టోర్నీలో ఉమ్మడి పది జిల్లాల జట్లు తలపడుతుండగా.. ఆతిథ్య మహబూబ్‌నగర్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీస్‌కు చేరింది. శనివారం జరిగిన లీగ్‌మ్యాచ్‌లో మెదక్ – హైదరాబాద్ జట్లు తలపడగా.. హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నల్లగొండ – రంగారెడ్డి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ 26 పరుగుల తేడాతో గెలిచింది. హైదరాబాద్ – వరంగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదిలాబాద్ – నిజామాబాద్ జట్ల మధ్య జరిగిన పోటీలో నిజామాబాద్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఖమ్మం– నిజామాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
● స్వామినారాయణ గురుకుల మైదానంలో ఉదయం ఆతిథ్య మహబూబ్‌నగర్ – కరీంనగర్ జట్లు పోటీపడ్డాయి. మహబూబ్‌నగర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు సాధించింది. జట్టులో హర్షిత్ 22 బంతుల్లో 35 పరుగులు చేయగా.. కరీంనగర్ జట్టులో రిషిత్, విశ్వతేజ చెరో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత 99 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కరీంనగర్ జట్టు.. 12 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహబూబ్‌నగర్ జట్టులో అభినవ్, దేవేందర్ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సాయంత్రం ఆదిలాబాద్‌తో జరిగిన మరో మ్యాచ్‌లోనూ మహబూబ్‌నగర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. హర్షిత్ 30 బాల్స్‌లో 55 పరుగులు చేయగా.. రామాచారి 27 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. ఇరువురు అర్ధసెంచరీలతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. తర్వాత 117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆదిలాబాద్ జట్టు.. తడబడుతూ ఆడింది. నిర్ణీత 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో హోమేస్ 14 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో అభినవ్, వంశీ, చరణ్ తలా ఒక వికెట్ తీశారు.
సెమీస్‌కు చేరిన మహబూబ్‌నగర్,
ఖమ్మం జట్లు
హోరాహోరీగా ఎస్‌జీఎఫ్ క్రికెట్ టోర్నీ
హోరాహోరీగా ఎస్‌జీఎఫ్ క్రికెట్ టోర్నీ


