తాగునీటి కష్టాలు తీర్చాలి..
గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా పూర్తిస్థాయిలో కావడం లేదు. సమీపంలో జూరాల ప్రాజెక్టు ఉందని సంబుర పడాల్సిందే తప్ప వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం చేతి పంపులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి తాగునీటి కష్టాలు తలెత్తకుండా చూడాలి. – వెంకటేష్, నందిమళ్ల
నీటి సరఫరా అస్తవ్యస్తం..
గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. అమరచింత క్రాస్‌రోడ్ నుంచి పైప్‌లైన్‌కు మోటారు ద్వారా నీటిని సరఫరా చేస్తే తప్ప గ్రామానికి తాగునీరు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి గతంలో ఉన్న సత్యసాయి తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తే తాగునీటి కష్టాలు తీరుతాయి. – రాజు, మస్తీపురం
రెండు మండలాలకు ఇబ్బంది..
జిల్లాలోని అన్ని మండలాలకు ఎల్లూరు రిజర్వాయర్ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నాం. జూరాల ప్రాజెక్టు ద్వారా అమరచింత, ఆత్మకూర్ మండలాలకు మాత్రమే తాగునీరు అందుతుంది. ఈ రెండు మండలాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికను సిద్ధం చేసుకొని పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటాం. – విజయ్‌కుమార్,
డీఈఈ, మిషన్ భగీరథ
●
తాగునీటి కష్టాలు తీర్చాలి..


