దినసరి కూలీ.. నేడు పుర చైర్‌పర్సన్
కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న రెడ్డిజ్యోతి సత్యనారాయణ వాల్మీకిబోయ కులానికి చెందిన మహిళ. ఆమె భర్త సత్యనారాయణ క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు తాపీ మేసీ్త్రగా పనిచేసేవారు. మొదటినుంచి సత్యనారాయణ కుటుంబం రాజకీయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వెంట నడుస్తూ వస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి జూపల్లి వర్గం నుంచి సత్యనారాయణ కౌన్సిలర్‌గా పోటీ చేసి 51ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆ వార్డు బీసీ మహిళకు రిజర్వ్ కేటాయించారు. దీంతో సత్యనారాయణ తన భార్య జ్యోతిని పోటీకి దింపారు. ఆమె స్థానికులతో కలిసి రెగ్యులర్‌గా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేది. ఆమె సహచర కూలీలు ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు. గతంలో ఓడిపోయారు.. ఇప్పుడు గెలిపించాలని ప్రచారాలు నిర్వహించారు. దీంతో జ్యోతి ఈ ఏన్నికల్లో 470 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. జ్యోతి 10వ తరగతి వరకు చదివింది. జ్యోతి సత్యనారాయణ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సత్యనారాయణ కుటుంబీకుల్లో ఓ సోదరుడు కృష్ణప్రసాద్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్నాడు. జ్యోతికి చైర్‌పర్సన్ పదవి దక్కడంపై ఆమె కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్న షేక్ రహీంపాషా కూడా మొదటినుంచి మంత్రి జూపల్లి వెంటే నమ్మకంగా ఉన్నారు. దీంతో ఆయనకు కూడా అదృష్టిం కలిసొచ్చింది.


