జిల్లా మొత్తం సెలవు ప్రకటించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నెల 11న జిల్లా మొత్తం సెలవు ఇవ్వాలని టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కలెక్టర్ విజయేంద్రకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఉద్యోగులలో చాలా మంది మహబూబ్ నగర్ పట్టణంలో నివసిస్తూ, వారి ఓటు హక్కు పట్టణంలోనే ఉన్నందున, వారు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ వెంటనే సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, ట్రెజరర్ కృష్ణమోహన్, శ్యాంసుందర్‌రెడ్డి, దేవేందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.


