జీవితం మీద ఆశలేదని మిత్రులకు మెసేజ్ పెట్టి..
మిడ్జిల్: మండల కేంద్రంలో యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మిడ్జిల్‌కు చెందిన ఎరుకలి అశోక్ (25) బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తల్లిదండ్రులను బంధువుల ఇంటికి పంపించి, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. తనకు జీవీతం మీద ఆశలేదని, తాను చనిపోవాలనుకుంటున్నానని ఇన్‌స్ట్రాగామ్‌లో మిత్రులకు మేసెజ్ పెట్టాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులు ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిగా మారాడు. ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడును వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి
తిమ్మాజిపేట: మండలంలోని మరికల్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మాజిపేటకు చెందిన అరవింద్ (17) అనే యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. తిమ్మాజీపేటకు చెందిన యువకులు అరవింద్, శివ, చింటు పని మీద జడ్చర్లకు వెళ్లారు. తిరిగి తిమ్మాజిపేటకు బైక్‌పై వస్తుండగా మార్గ మధ్యలో మరికల్ సమీపంలో జడ్చర్ల వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ చింటు తీవ్రంగా గాయపడ్డాడని స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఇద్దరిని మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘనా స్థలంలో వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు తప్పించుకొని పోగా ఇంటర్ సెకండియర్ చదువుతున్న అరవింద్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.


