భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్‌నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సును శనివారం ఆర్‌ఎం ప్రారంభించారు. రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి శ్రీఽశైలంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. రద్దీ దృష్ట్యా మరిన్ని నడుపడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ, డిపో మేనేజర్ అశోక్‌కుమార్, అసిస్టెంట్ మేనేజర్ కవిత, జయరాం, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.


