మక్తల్‌లో బీజేపీ ఆందోళన
నారాయణపేట/ మక్తల్: మక్తల్ మున్సిపాలిటీలోని 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ముందుగానే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తేవడంతోపాటు మహదేవప్ప భార్యతో ఫిర్యాదు తీసుకొని తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకోవడం ఏమిటని డీఎస్పీతో రాష్ట్ర నాయకులు నాగూరావు నామోజీ, కొండయ్య, శంకరోళ్ల రవికుమార్ తదితరులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ నేతల బెదిరింపులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు తీసుకున్న ఫిర్యాదు పత్రం తమకు వెంటనే చూపించాలని డిమాండ్ చేశారు.
డీఎస్పీతో వాగ్వాదానికి
దిగిన బీజేపీ నాయకులు


