రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రతిభ చూపాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రతిభ చూపాలి

Feb 15 2026 9:43 AM | Updated on Feb 15 2026 9:43 AM

రాష్ట

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రతిభ చూపాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: ఈనెల 17నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌కు ఎంపిక అయిన పోలీస్‌ క్రీడకారులు ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని ఎస్పీ డి.జానకి అన్నారు. పో లీస్‌ క్రీడలకు ఎంపిక అయిన సిబ్బందికి శనివా రం ఎస్పీ కార్యాలయంలో స్పోర్ట్స్‌ కిట్లు, ట్రాక్‌సూట్లు, షూలను ఎస్పీ అందజేశారు. జోగుళాంబ జోన్‌ నుంచి వెళ్తున్న క్రమంలో జిల్లాకు మంచి ఖ్యాతి తీసుకురావాలన్నారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాకుండా పోలీస్‌ శా ఖలోని క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సహన శక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే వేదిక అని తెలిపారు. ఏఎస్పీ సురేష్‌కుమార్‌, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్‌, సత్యం పాల్గొన్నారు.

శివాలయాల్లో ప్రత్యేక బందోబస్తు

మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శివాలయాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ప్రముఖ ఆలయాలు కందూరు రామలింగేశ్వరస్వామి, మన్యంకొండ, వీరన్నపేటలోని పెద్దశివాలయం, పిల్లలమర్రి శివాలయం వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ముగిసిన జిల్లాస్థాయి సీఎం కప్‌ క్రీడలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడలు శనివారం ముగిశాయి. చివరిరోజు బాక్సింగ్‌, యోగా, అత్యపత్య, ఆర్చరీ, హాకీ, తైక్వాండో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. క్రీడాకారుల యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెడల్స్‌ అందజేశారు. పురుషుల బాక్సింగ్‌లో పి.సాయిరాం(దేవరకద్ర), మహిళల విభాగంలో జోగు వైష్ణవి(మహబూబ్‌నగర్‌), ప్రథమ, యోగాలో వినోద్‌కుమార్‌ (జడ్చర్ల), ధనలక్ష్మి (మహబూబ్‌నగర్‌), తైక్వాండోలో ఎండీ బాలేషరీఫ్‌, సోఫియాతస్లీమ్‌, హాకీలో బాలానగర్‌ జట్టు ప్రథమ స్థానంలో నిలిచాయి. జిల్లా యువజన, క్రీడలశాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ రవీందర్‌రెడ్డి, బాల్‌రాజు, అరుణజ్యోతి, నర్సింలు, సాయికుమార్‌, సురేష్‌, డీఎస్‌ఏ కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

తగ్గిన వేరుశనగ ధరలు

జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌లో వేరుశనగ ధర లు రోజురోజుకు తగ్గుతున్నాయి. శనివారం క్వింటా గరిష్టంగా రూ.9,399, కనిష్టంగా రూ.3,029 ధరలు లభిచాయి. కందులకు గరిష్టంగా రూ.7,812, కనిష్టంగా రూ. 5,555, మినుములు గరిష్టంగా రూ.8,349, కనిష్టంగా రూ.8,339, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,693, కనిష్టంగా రూ.6,689, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,876, కనిష్టంగా రూ.1,848, ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం రూ.2,409, పత్తి గరిష్టంగా రూ.6,869 ధరలు లభించాయి. దేవరకద్రలో కందులు క్వింటా గరిష్టంగా రూ.7,579, కనిష్టంగా రూ.7,219గా ధరలు పలికాయి.

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రతిభ చూపాలి 
1
1/1

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్‌ మీట్‌లో ప్రతిభ చూపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement