పల్లి ధరలు పతనం!
● ఆందోళనలో అన్నదాతలు
● బాదేపల్లి యార్డులో కనిష్ట ధర రూ.3,900
●
రూ.3900 వచ్చింది
బాదేపల్లి మార్కెట్‌లో వేరుశనగకు మంచి డిమాండ్ ఉందని భావించి ఇక్కడకు 52 బస్తాలను తీసుకొచ్చా. క్వింటా ధర రూ.3900 మాత్రమే వచ్చింది. 3 ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగకు రూ.70వేలపైనే పెట్టుబడి అయ్యింది. కానీ వచ్చిన దిగుబడిని అమ్మితే పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. పంటను వెనక్కి తీసుకుపోలేక, యార్డులో పడిగాపులు పడే పరిస్థితి లేక వచ్చిన ధరకు అమ్ముకుపోతున్నా.
– నరేశ్‌యాదవ్, హస్నాబాద్, కొడంగల్
పెట్టుబడులు
వచ్చే పరిస్థితి లేదు
వేరుశనగ పంట దిగుబడులు తగ్గాయి. పండిన పంటను అమ్ముకుపోదామని వస్తే సరైన ధరలు రావడంలేదు. వ్యాపారులు పూర్తిగా ధరలను తగ్గించేశారు. 48 బస్తాల వేరుశనగను యార్డుకు తీసుకొస్తే క్వింటాకు రూ.8700 ధర మాత్రమే వచ్చింది. అధికారులు స్పందించి మంచి ధరలు వచ్చేలా చూడాలి.
– బాల్‌రాజ్, హకీంపేట, కొడంగల్
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొన్నిరోజులుగా ఎగిసి పడిన వేరుశనగ(పల్లి) ధరలు వరుసగా పడిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేరుశనగకు ప్రభుత్వ మద్దతు ధరలను మించి లభిస్తుండడమేగాక అత్యధికంగా క్వింటా రూ.13వేల చేరువకు చేరిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల రైతులు వేరుశనగ దిగుబడులను బాదేపల్లి యార్డుకు తీసుకొస్తున్నారు. అయితే ఇక్కడి వ్యాపారులు క్రమంగా వేరుశనగ ధరలను తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కుమ్మకై ్క ఒకటి రెండు కుప్పలకు అధిక ధరలను కేటాయించి మిగతా కుప్పలకు మద్దతు ధర కంటె తక్కువగా ధరలను నిర్ణయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో తమకు సరైన ధరలు లభించడంలేదని వాపోతున్నారు. ఇంటి వద్ద మిగతా వ్యవసాయ పనులు ఉండడం తదితర కారణాలతో ఆశించిన ధరల కోసం రోజుల తరబడి మార్కెట్‌లో పడిగాపులుగాసే పరిస్థితిలేదని రైతులు ఈ సందర్భంగా తెలిపారు.
కనిష్ట ధర రూ.3869
బాదేపల్లి మార్కెట్‌కు సోమవారం వివిధ ప్రాంతాల న ఉంచి 2, 607 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ.10,361 రాగా.. కనిష్టంగా రూ.3,869 ధరను కేటాయించారు. నెలరోజులుగా సగటున వేరుశనగ కనిష్ట ధరలను పరిశీలిస్తే క్వింటాకు రూ.3869నుంచి రూ.6వేలలోపే ఎక్కువగా ధరలు కేటాయించారు. ఎక్కడో ఒకటిరెండు కుప్పలకు మాత్రం మద్దతు ధర రూ.7263ను మించి ఎక్కువ వేసి మిగతా కుప్పల వద్ద ధరలను తక్కువ వేస్తున్నారని రైతులు తెలిపారు. దీంతో పెట్టుబడులు రాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత మార్కెట్ యార్డు అధికారులు, పాలకులు స్పందించి వేరుశనగకు మంచి ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పల్లి ధరలు పతనం!
పల్లి ధరలు పతనం!


