మహబూబ్‌నగర్‌ను అగ్రగామిగా నిలబెడతాం | - | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌ను అగ్రగామిగా నిలబెడతాం

Feb 10 2026 7:58 AM | Updated on Feb 10 2026 7:58 AM

మహబూబ్‌నగర్‌ను అగ్రగామిగా నిలబెడతాం

మహబూబ్‌నగర్‌ను అగ్రగామిగా నిలబెడతాం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెడతామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు సోమవారం నగరంలోని తూర్పు కమాన్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం మీదుగా క్లాక్‌టవర్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆధ్వర్యంలో మెట్టుగడ్డ, జీజీహెచ్‌, న్యూటౌన్‌ మీదుగా క్లాక్‌టవర్‌ చేరుకున్నారు. అనంతరం కార్నర్‌ మీటింగ్‌లో యెన్నం మాట్లాడుతూ పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే ప్రజల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, మౌలిక వసతులు, నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎస్‌.వినోద్‌కుమార్‌, సత్తూర్‌ చంద్రకుమార్‌గౌడ్‌, గోనెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement