ఓటు అమ్మకు.. హక్కు కోల్పోకు..
నోటుకు ఓటును అమ్ముకుంటే నీకున్న హక్కును కోల్పోతావని సీనియర్ సిటీజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు అన్నారు. సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ఓటుహక్కుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక రెడ్‌క్రాస్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఓటును అమ్ముకున్నప్పుడు సమస్యలపై ప్రశ్నించే హక్కును కోల్పోతారని, ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అన్నారు. సమాజ భవిష్యత్‌ను నిర్ణయించే శక్తి ఓటుకు ఉందన్నారు. ప్రతి వ్యక్తి నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నస్కంటి నాగభూషణం, కోటేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, నాగభూషణం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – మెట్టుగడ్డ


