‘మహా’వేడుకకు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

‘మహా’వేడుకకు ముస్తాబు

Feb 15 2026 12:26 PM | Updated on Feb 15 2026 12:26 PM

‘మహా’

‘మహా’వేడుకకు ముస్తాబు

అచ్చంపేట: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తుల సందడితో నల్లమలలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభోశంకర అంటూ పరమశివుడిని కీర్తిస్తూ తరలివస్తున్నారు. సదాశివుడికి ఇష్టమైన మహాశివరాత్రి పండుగ ఈనెల15న ఆదివారం కావడంతో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతోపాటు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

తేజోలింగ రూపంలో దర్శనం

మహాశివరాత్రి నాటి రాత్రి పరమశివుడు కమలనాభ, కమలగర్భులిరువురికీ తేజోలింగరూపంలో దర్శనమిచ్చాడని లింగ, కూర్మ, శివ పురాణాల్లో ఉంది. మహాశివరాత్రి గురించి మరో అంశం కూడా ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పడు వచ్చిన గరళాన్ని పరమశివుడు మింగి సకలలోకాలకు శుభాన్ని కలిగించిన మాఘ బహుళ చతుర్థశినే మహాశివరాత్రిగా ఆచరిస్తున్నాం. శివుడికి ప్రీతిపదమైన ఆదివారం మహాశివరాత్రి పర్వదినాని రాత్రి 10గంటల నుంచి 11మంది రుత్వికులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, లింగోద్భవకాల అభిషేకాన్ని పరమాద్భుతంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో అర్చకులు, వేదపండితులు మినహా మరెవరినీ గర్భాలయంలోకి అనుమతించరు.

క్షేత్రంలో వెలిసిన ఉమామహేశ్వరుడు

సోమేశ్వరాలయం ముస్తాబు

కొల్లాపూర్‌రూరల్‌: కొల్లాపూర్‌ మండలం సోమశిలలో వెలిసిన లలితాంబికా సోమేశ్వరాయలం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అందంగా తయారు చేశారు. ఈనెల 15నుంచి 19వరకు వేదపండితులు పలు పూజాకై ంకర్యాలునిర్వహించనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నిఏర్పాట్లు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కృష్ణానది బ్యాక్‌వాటర్‌లో సప్తనదులు కలవడంతోపాటు ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, లలితాంబిక అమ్మవారు ఉండడంతో భక్తులు అధికసంఖ్యలో వస్తారని నిర్వాహకులు తెలిపారు. 15న శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు భక్తులకు దర్శనాలు ఉంటాయని, 9గంటలకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 16న ఉదయం శివపార్వతులకు కల్యాణోత్సవం, సాయంత్రం రథోత్సవం, 19న స్వామివారికి మంగళహారతి నిర్వహిస్తారు. సోమశిలకు వచ్చే భక్తులకు కొల్లాపూర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుదని తెలిపారు.

నల్లమలలోని శైవక్షేత్రాలకు భక్తుల తాకిడి

ఆలయాల్లో మార్మోగుతున్న శివనామస్మరణ

విద్యుద్దీపాలంకరణలో సర్వాంగ సుందరంగా..

‘మహా’వేడుకకు ముస్తాబు 1
1/2

‘మహా’వేడుకకు ముస్తాబు

‘మహా’వేడుకకు ముస్తాబు 2
2/2

‘మహా’వేడుకకు ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement