హెచ్‌సీఏ అండర్–14 జట్టుకు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు సాయిరాం హెచ్‌సీఏ అండర్–14 బాలుర జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది కూడా అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తమిళనాడులోని చైన్నెలో ఈనెల 13వ తేదీ నుంచి 23 వరకు జరిగే అండర్–14 క్రికెట్ టోర్నమెంట్‌లో సాయిరాం పాల్గొననున్నాడు. పెవిలియన్ క్రికెట్ క్లబ్‌లో శిక్షణ తీసుకుంటున్న సాయిరాం హైదరాబాద్‌లోని ఎంఎల్ జయసింహ క్రికెట్ క్లబ్ తరఫున లీగ్ మ్యాచుల్లో ప్రతిభ చాటాడు. 9 లీగ్ మ్యాచుల్లో 277 పరుగులు చేశాడు. సాయిరాం ఎంపికపై పెవిలియన్ క్రికెట్ క్లబ్ కోచ్ భరత్‌గౌడ్, అసిస్టెంట్ కోచ్ మెకల్లమ్, సీనియర్ క్రీడాకారుడు రియాజుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు.
మద్యం మత్తులో అత్తపై అత్యాచారం, హత్య
కల్వకుర్తి రూరల్: మద్యం మత్తులో వృద్ధురాలు అయిన అత్తను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మండలంలోని రఘుపతిపేటలో జరిగింది. కల్వకుర్తి సీఐ నాగార్జున కథనం ప్రకారం.. పసుపుల చెన్నమ్మ (65) భర్త మూడేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు చనిపోగా మరో కుమారుడు వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న కుమార్తె రేణుక, అల్లుడు బైరంపల్లి రాఘవేందర్ ఇంట్లో చెన్నమ్మ ఉంటోంది. రాఘవేందర్ మద్యానికి బానిస కావడంతో భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. రెండు రోజుల క్రితం గొడవపడి రేణుక వెల్దండ మండలంలోని తన అక్క ఇంటికి వెళ్లింది. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన రాఘవేందర్ అత్త చెన్నమ్మపై అత్యాచారం చేసి, హత్య చేశాడని సీఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
హెచ్‌సీఏ అండర్–14 జట్టుకు ఎంపిక


