ప్రతి ఓటరు ప్రశాంతంగా ఓటు వేయవచ్చు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: ఈనెల 11న జిల్లాలో జరిగే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో పకడ్బందీగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పోలీస్ ఫ్లాగ్‌మార్చ్‌లో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం నడుచుకోవాలని, ఎవరైనా గడువు ముగిసిన కూడా ప్రచారం చేయాలనే చూస్తే కఠినచర్యలు తీసుకున్నారు. ప్రతి ఓటరు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫ్లాగ్‌మార్చ్ వన్‌టౌన్ నుంచి క్లాక్‌టవర్, అక్కడి నుంచి వీరన్నపేట వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, ఎస్‌ఐ శీనయ్య పాల్గొన్నారు.


