క్రీడాపోటీలు
ఉత్సాహంగా
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి క్రీడాపోటీలు ఉత్సాహంగా జరిగాయి. మొదటి రోజు బాల బాలికలకు అథ్లెటిక్స్, కబడ్డీ, బేస్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, నెట్‌బాల్, క్యారమ్, చెస్, సాఫ్ట్‌బాల్, కిక్‌బాక్సింగ్ పోటీలు జరిగాయి. క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డాయి. రెండు రోజు నేడు (శుక్రవారం) ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఖోఖో, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, కరాటే, జూడో పోటీలు జరగనున్నాయి.
● మహిళల కబడ్డీలో జడ్చర్ల ప్రథమ, మహబూబ్‌నగర్ ద్వితీయ, పురుషుల్లో జడ్చర్ల ప్రథమ, దేవరకద్ర ద్వితీయ, నెట్‌బాల్ మహిళల్లో మహబూబ్‌నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్‌నగర్ రూరల్ ద్వితీయ, పురుషుల్లో మహబూబ్‌నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్‌నగర్ రూరల్ ద్వితీయ, సాఫ్ట్‌బాల్ మహిళల్లో మహబూబ్‌నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్‌నగర్ రూరల్ ద్వితీయ, పురుషుల్లో మహబూబ్‌నగర్ రూరల్ ప్రథమ, మహబూబ్‌నగర్ అర్బన్ ద్వితీయ, బేస్‌బాల్ మహిళల్లో మహబూబ్‌నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్‌నగర్ రూరల్ ద్వితీయ, మహబూబ్‌నగర్ అర్బన్ ప్రథమ, మహబూబ్‌నగర్ రూరల్ ద్వితీయ, క్యారమ్స్ మహిళల్లో అర్చన ప్రథమ, డబుల్స్‌లో చందన–విజయలక్ష్మి ప్రథమ, బాలురలో మహ్మద్ జాబేర్ ప్రథమ, డబుల్స్‌లో శ్రీకాంత్–ప్రతీక్ ప్రథమ, చెస్ బాలికల్లో లాస్యశ్రీ ప్రథమ, ఆయేఝా జబీన్ ద్వితీయ, బాలురలో హవేష్‌రెడ్డి ప్రథమ, భానుప్రకాశ్ ద్వితీయ, బ్యాడ్మింటన్ 15 ఏళ్ల విభాగం బాలికల్లో రిషిత ప్రథమ, సర్వఘ్న ద్వితీయ, బాలురలో శివకుమార్ ప్రథమ, సహష్రద్ ద్వితీయ....అనంతరం గెలుపొందిన వారికి ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా యువజన, క్రీడలశాఖ సూపరింటెండెంట్ రాజ్‌గోపాల్, సీనియర్ అసిస్టెంట్ రవీందర్‌రెడ్డి, డీఎస్‌ఏ కోచ్‌లు సునీల్‌కుమార్, పర్వేజ్‌పాష, ఖలీల్, రాజ్‌గోపాల్, అంజద్, పీడీలు వేణుగోపాల్, జగన్‌మోహన్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, అయూబ్‌ఖాన్, ఆంజనేయులుగౌడ్, సాదత్‌ఖాన్, వడెన్న, బాల్‌రాజ్, రామేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


