పట్టం కట్టారు.. ప్రగతి చూపిస్తాం
● తొలి కార్పొరేటర్ల మనోగతం
● మహిళలే అధికం
పాలమూరు/స్టేషన్ మహబూబ్‌నగర్: ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో యువకులు, గృహిణులు, విద్యావంతులు, వైద్యులు, న్యాయవాదులు ఇలా ప్రతి రంగం నుంచి పోటీపడ్డారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 60డివిజన్‌లలో 40మంది తొలిసారిగా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. గెలుపొందినవారిలో అధిక మొత్తంలో మహిళలు ఉండడం విశేషం. వీరిలో చాలావరకు గృహిణులే ఉండగా.. చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా ఉన్నారు. నూతనంగా ఎన్నికై న కార్పొరేటర్లు ‘సాక్షి’తో వారు చేయనున్న అభివృద్ధి ఇతర అంశాలపై మనోగతం పంచుకున్నారు.
అధికార పార్టీ కాకపోయిన ప్రతిపక్ష పార్టీ నుంచి పోటీచేసిన న న్ను ఈ డివిజన్ ప్రజ లు ఆదరించి అశీర్వదించడం వల్లే గెలుపు సాధ్యమైంది. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లాను. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ వారికి ఏం చేయాలనే అంశంపై పూర్తిగా అవగాహన తెచ్చు కు న్నా. నా భర్త నరేశ్ ప్రోత్సాహంతో రాబో యే ఐదేళ్ల కాలంలో సద్దలగుండు, రాజేంద్రనగర్ డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం.
– లక్ష్మీనరేశ్ ముదిరాజ్, 41వ డివిజన్


