వైభవంగా శివపార్వతుల కల్యాణం
అచ్చంపేట: శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమామహేశ్వక్షేత్రంలో సోమవారం తెల్లవారుజామున శివపార్వతుల కల్యాణం మహోత్సవం అంగరంగా వైభవంగా నిర్వహించారు. సుప్రభాతసేవ, గణపతిపూజ, మండప ఆరాధన, అంకురార్పణ,ఽ ధ్వజారోహణ, సర్వదేవతా ఆవాసన, శివ పార్వతుల కల్యాణ ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, డాక్టర్ అనురాధ దంపతులు వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, ఈఓ శ్రీనివాసరావులు కల్యాణ వస్త్రాలను అందజేశారు. అలయ అర్చకులు వీరయ్యశాస్త్రి ఆధ్వర్యంలో పడింతులు వేదమంత్రాల నడుమ కల్యాణం జరిపించారు. లింగోద్భవ కాలంలో ఏకాదశి రుద్బాభిషేకం నిర్వహించారు. పలకపల్లి రామలింగేశ్వర ఆలయంలో జరిగిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు.
పల్లకీసేవపై ఆదిదంపతుల ఊరేగింపు


