పురుగుమందు పిచికారీ చేస్తూ మహిళ మృతి
చిన్నంబావి: పురుగు మందు పిచికారీ చేసే క్రమంలో అస్వస్థతకు గురై మహిళా మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే మండలంలోని వెల్టురు గ్రామానికి చెందిన పల్లవి (28) ఆదివారం సాయంత్రం భర్తతో కలిసి పొలంలో పురుగు మందు పిచికారీ చేసేందుకు వెళ్లి అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుదూ సొమవారం మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు అలాగే తొమ్మిది నెలల చిన్నారి ఉండడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చంటి పాపను చూసి గ్రామస్తులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


