గంజాయి పట్టివేత: నిందితుడి అరెస్ట్
జడ్చర్ల: పట్టణ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిని అనుసరించి రాజీవ్‌నగర్ కాలనీలోని ఓ ఇంటిలో గుట్టుగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయన్న సమాచారంతో ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. దాడుల్లో 215గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కుమార్(మింటూ) హైదరాబాద్‌లోని దూల్‌పేట ప్రాంతం నుంచి ఎండుగంజాయిని తీసుకొచ్చి 5గ్రాముల చొప్పున తయారు చేసిన ఒక్కో ప్యాకెట్‌ను రూ.500కు విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించా రు. నిందితుడు జడ్చర్లకు చెందినవాడని, గతంలో గంజాయి కే సులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి మొ బైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐ కార్తిక్‌రెడ్డి, హెచ్‌సీ మురళీమోహన్, కానిస్టేబుళ్లు అనిల్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
ఎద్దుపై పెద్దపులి దాడి
అచ్చంపేట రూరల్: పాకలో కట్టి ఉంచిన ఎద్దుపై పెద్దపులి దాడి చేసిన ఘటన మంగళవారం మండలంలోని గుంపన్‌పల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గిరిజన రైతు సబావట్ హట్టి తన వ్యవసాయ పొలంలోని పాకలో సోమవారం రాత్రి కాడెద్దులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి పెద్దపులి పాకలో ఉన్న ఎద్దుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఉదయం రైతు వ్యవసాయ పొలానికి వెళ్లి చూడగా ఎద్దు తీవ్రంగా గాయపడి ఉండటాన్ని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలకిష్టయ్య, బీట్ ఆఫీసర్ శివశంకర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెటర్నరీ సిబ్బందిని పిలిచి ఎద్దుకు చికిత్స అందించారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు, రైతులు భయాందోళన గురవుతున్నారు.
గంజాయి పట్టివేత: నిందితుడి అరెస్ట్


