జేఈఈ మెయిన్స్‌లో వాగ్దేవి ప్రభంజనం
పాలమూరు: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షా ఫలితాల్లో వాగ్దేవి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 21నుంచి 28వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాల్లో వాగ్దేవి కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఫలితాల్లో జె.శివ 94.04పర్సంటైల్, కౌశిక్ 85.40పర్సంటైల్ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సోమవారం విజేత వెంకట్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ నెలలో జరిగే రెండోవిడత కూడా ఉత్తమ పర్సంటైల్ సాధించాలన్నారు. కార్యక్రమంలో ఐఐటీ నీట్ అకాడమీ ఇన్‌చార్జి పావనిరెడ్డి, ప్రిన్సిపాల్ గీతాదేవి, అధ్యాపకులు రాఘవేంద్ర, షాకీర్, యాకుబ్, సందీప్, గోవిందరాజులు, రాంరెడ్డి, మహేశ్, అప్పారావు పాల్గొన్నారు.


