నల్లగొండపై పాలమూరు జట్టు విజయం
మహబూబ్‌నగర్ క్రీడలు: మెదక్‌లో మంగళవారం జరిగిన హెచ్‌సీఏ అండర్–19 ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే టోర్నీలో మహబూబ్‌నగర్ విజయం సాధించింది. మ్యాచ్‌లో 9వికెట్ల తేడాతో నల్లగొండ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్గొండ జట్టు 38.8 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. మహబూబ్‌నగర్ బౌలర్లు గగన్, మణిచరణ్, జశ్వంత్ చెరో మూడేసి వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహబూబ్‌నగర్ జట్టు 41 ఓవర్లలో వికెట్ కోల్పోయి 187 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా, వర్షిత్ రెడ్డి అజేయంగా నిలిచి 177 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అబ్దుల్ రాఫే 125 బంతుల్లో 11 ఫోర్లతో 95, వర్షిత్‌రెడ్డి 115 బంతుల్లో 9 ఫోర్లతో 71 పరుగులు చేశారు.
అబ్దుల్ రాఫే
(95 పరుగులు నాటౌట్)
వర్షిత్‌రెడ్డి
(71 పరుగులు నాటౌట్)
హెచ్‌సీఏ టోర్నీలో రాణించిన
అబ్దుల్ రాఫే, వర్షిత్‌రెడ్డి
నల్లగొండపై పాలమూరు జట్టు విజయం
నల్లగొండపై పాలమూరు జట్టు విజయం


