సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లు | - | Sakshi
Sakshi News home page

సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లు

Feb 15 2026 12:27 PM | Updated on Feb 15 2026 12:27 PM

సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లు

సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లు

అలంపూర్‌: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్లు శనివారం రాత్రి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. వడ్డేపల్లి పురపాలిక ఎన్నికల్లో వడ్డేపల్లి శ్రీనివాసులు వర్గానికి చెందిన ఆల్‌ ఇండియా ఫార్వర్డుబ్లాక్‌ పార్టీ నుంచి ఎనిమిది మంది పోటీ చేసి కౌన్సిలర్లుగా విజయం సాధించారు. మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులు ఉండడంతో 8 స్థానాలతో చైర్మన్‌ పీఠాన్ని ఆల్‌ ఇండియా ఫార్వార్డు బ్లాక్‌ పార్టీ దక్కించుకోనుంది. చైర్మన్‌ ఎన్నిక ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో... హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ సంపత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement