కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు | - | Sakshi
Sakshi News home page

కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు

Feb 5 2026 7:24 AM | Updated on Feb 5 2026 7:24 AM

కుష్ట

కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు

భిక్కనూరు: కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం వారు రామేశ్వర్‌పల్లిలో ఆరోగ్య ఉపకేంద్రం వద్ద కుష్టువ్యాధి నివారణకు కృషి చేస్తామని గ్రామస్తులతో కలిసి నిర్వహించిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా మందులు వాడి చికిత్సలు చేయించుకుంటే వ్యాధి తగ్గుతుందన్నారు. సర్పంచ్‌ చేపూరి రాణి, వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ వినోద్‌గౌడ్‌, ఎంఎంసీ డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి, ఏఎన్‌ఎం మాధవి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ఎల్లమ్మ చక్ర తీర్థం

దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రా మ ఎల్లమ్మ ఆలయంలో ఆలయ వార్షికోత్సవా ల్లో భాగంగా బుధవారం అమ్మవారికి గ్రామాని కి చెందిన మహిళలు ఒడిబియ్యం పోశారు. చక్ర తీర్థం కార్యక్రమం నిర్వహించారు. మొ క్కులను తీర్చుకున్నారు. గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు కేపీ రామాగౌడ్‌, లక్ష్మీనారాగౌడ్‌, అధ్యక్షులు అనిల్‌గౌడ్‌, ఉపాధ్యక్షులు ప్రకాష్‌గౌ డ్‌, కార్యదర్శి చంద్రగౌడ్‌ పాల్గొన్నారు.

ప్రారంభమైన ఖండేరాయ

ఆలయ వార్షికోత్సవాలు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ఉత్తునూర్‌లో ఖండేరాయ ఆలయ వార్షికోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ గైని రాజయ్య, వీడీసీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రావు, పాల కేంద్రం అధ్యక్షుడు దొడ్లె రవి, మాజీ ఎంపీటీసీ రాంచందర్‌ రావు, విండో మాజీ చైర్మన్‌ ప్రభాకర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.

మల్లేశ్వర ఆలయంలో

సంత్‌ నరహరి పుణ్యతిథి

మద్నూర్‌(జుక్కల్‌): మండల కేంద్రంలోని మల్లేశ్వర ఆలయంలో బుధవారం సంత్‌ నరహరి సోనార్‌ పుణ్యతిథి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సంత్‌ నరహరి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. వార్కారీలు, భజన మండలి సభ్యుల బృందం.. ఆలయంలో కీర్తన, భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఘనంగా బోనాల ఊరేగింపు

భిక్కనూరు: మండల కేంద్రంలోని రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం 50వ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించారు. దారిపొడవునా పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారికి బోనాలను సమర్పించి పూజలు నిర్వహించారు.

కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు1
1/3

కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు

కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు2
2/3

కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు

కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు3
3/3

కుష్టు వ్యాధి బాధితులపై వివక్ష చూపొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement