ఎన్నికల నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు పాటించాలి

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

ఎన్ని

ఎన్నికల నిబంధనలు పాటించాలి

సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి

బిచ్కుందలో అభ్యర్థులకు ఎన్నికల నియమావళిపై అవగాహన

బిచ్కుంద(జుక్కల్‌): మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. బిచ్కుందలో గురువారం ఆమె పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు వ్యయపరిమితి దాటవద్దని, ఎన్నికల సంఘం సూచించిన ప్రకారం డబ్బులు ఖర్చు చేయాలన్నారు. అభ్యర్థి బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో మొత్తం జమ చేసి ప్రచారంలో భాగంగా ఖర్చు చేసిన ప్రతీ దానికి బిల్లులు తప్పకుండా చూపించాల్సి ఉంటుందన్నారు. ర్యాలీలు, బహిరంగా సమావేశాలకు అధికారుల అనుమతి తప్పకుండా తీసుకోవాలని సూచించారు. కమిషనర్‌ ఖ య్యుం ఇతర అధికారులు ఉన్నారు.

బాన్సువాడలో

బాన్సువాడ: పట్టణంలో గురువారం మున్సిపల్‌ ఎన్నికల ఖర్చుపై అభ్యర్థులకు సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో చేసే ఖర్చుకు సంబంధించిన లెక్కల వివరాల సమాచారం పక్కాగా ఉండాలని అన్నారు. ఏటీవో జగన్‌ తదితరులు ఉన్నారు.

బ్యాలెట్‌ బాక్సులు ిసిద్ధం

ఎల్లారెడ్డి: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది గురువారం బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులను పరిశీలించి వాటికి ఆయిల్‌ వేసి శుభ్రం చేశారు. దీంతోపాటు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సామగ్రిని సైతం అధికారులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలి 1
1/2

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ఎన్నికల నిబంధనలు పాటించాలి 2
2/2

ఎన్నికల నిబంధనలు పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement