సంక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

సంక్ష

సంక్షిప్తం

వికలాంగుడికి సొంత డబ్బును

పింఛన్‌గా అందించిన సర్పంచ్‌

ఎల్లారెడ్డిరూరల్‌: మండలంలోని వెల్లుట్ల గ్రామంలో సర్పంచ్‌ సాయిలు గురువారం వికలాంగుడు మంగళి రమేష్‌కు తన సొంత డబ్బులను పింఛన్‌గా అందించారు. ప్రభుత్వం నుంచి అతడికి పింఛన్‌ మంజూరయ్యే వరకు తన సొంత డబ్బులతో ప్రతి నెల పింఛన్‌గా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్థికసాయం అందజేత

భిక్కనూరు: బస్వాపూర్‌ గ్రామానికి చెందిన దంపతులు బాలురాజు–మంజుల ఇటీవల ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బాధిత కుటుంబానికి గురువారం గ్రామానికి చెందిన చంద్రంసేటు రూ.11వేలు, బియ్యం, బాదే గురువయ్య రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు. ఉపసర్పంచ్‌ కార్తిక్‌రెడ్డి, నేతలు తుడుం స్వామి ఉన్నారు.

ఆర్థిక సాయం అందిస్తా..

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలోని 8వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం చేస్తు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వార్డు పరిధిలో ఆడ పిల్ల వివాహానికి రూ.11 వేల ఆర్థిక సహాయం, ఆడపిల్ల జన్మిస్తే కుటుంబ సభ్యులకు రూ. 10వేల ఆర్ధిక సహాయం, వార్డులో ఎవరైనా మృతి చెందితే వారి అంత్యక్రియల ఖర్చులకు రూ. 10వేల ఆర్థిక సహాయంతో పాటు, ఆరు నెలలకొకసారి వార్డులో హెల్త్‌ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని హామీ ఇస్తు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆపాలి

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆపాలని సదాశివనగర్‌ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. ఈమేరకు వారు గురువారం కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్‌ దినేష్‌కు వినతిపత్రం అందజేశారు. డీఎం సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. సర్పంచ్‌ శిరీష, ఉప సర్పంచ్‌ కుందెన ప్రవీణ్‌కుమార్‌, వార్డు సభ్యులు బందా సాయవ్వ, సాగర్‌, మంజూల, రాజమణి, పోసాని భైరయ్య, కోతి బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొత్త మహిళా సమాఖ్య భవనం నిర్మించాలి

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో నూతన మహిళా సమాఖ్య భవనం నిర్మించాలని మహిళ సమాఖ్య ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక భవనం లేక సమావేశాలు జరుపుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సంఘ భవనం కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసి త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ కాలేజీల్లోనే మౌళిక సదుపాయాలు, అర్హత గల అధ్యాపకులు ఉంటారని, నాణ్యమైన విద్య అందుతుందని అధ్యాపకులు అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గంగారం, సిబ్బంది గురువారం గండివేట్‌, గౌరారం జెడ్పీ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన తర్వాత విద్యార్థులు ఇంటర్‌ కోసం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని సూచించారు.

పొక్లెయిన్‌, ట్రాక్టర్ల సీజ్‌

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌ 86లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్‌, ఐదు ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు గిర్దావర్‌ సంతోష్‌ గురువారం తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు జరిపితే చర్యలు తప్పవన్నారు. వాహనాలను పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట జూనియర్‌ అసిస్టెంట్‌ నర్సింగ్‌రావు, జీపీవో నవీన్‌ తదితరులు ఉన్నారు.

సంక్షిప్తం1
1/1

సంక్షిప్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement