ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గించుకోవాలి
బాన్సువాడ రూరల్: లబ్ధిదారులు వీలైనంత వరకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గించుకోవాలని కామారెడ్డి జిల్లా హౌజింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆయన బోర్లంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించారు. మంజూరై ఇంకా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఇంటి నిర్మాణాల కోసం ఇతరులను చూసి అనవసర ఖర్చులు చేయవద్దన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో పనుల పురోగతిపై పంచాయతీ కార్యదర్శి సాయికుమార్‌తో సమీక్షించారు. హౌసింగ్ డీఈ గోపాల్, ఏఈ వినీత్ పాల్గొన్నారు.


