బ్లాక్ లెవల్ స్పోర్ట్ ్స మీట్ ప్రారంభం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఆర్డీవో పార్థసింహారెడ్డి బుధవారం ప్రారంభించారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమంలో ఆర్డీవో పాల్గొని మాట్లాడారు. యువత చేతిలో దేశ భవిష్యత్తు ఉందని, యువత ఎల్లపుడు కష్టపడి చదివి ఉన్నత స్థానాలలో ఉండాలన్నారు. యువత ఆటపాటలలో ముందుండాలన్నారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలె్‌న్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యతను వెలికితీయడానికి భారత ప్రభుత్వం మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాశాల విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, చెస్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం మెమోంటోలను అందించారు. కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కో–ఆర్డినేటర్ వి.శంకరయ్య, స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ శివకుమార్, కళాశాల స్పోర్ట్స్ కమిటీ మెంబర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


