పనులు నాణ్యతగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పనులు నాణ్యతగా చేపట్టాలి

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

పనులు

పనులు నాణ్యతగా చేపట్టాలి

పనులు నాణ్యతగా చేపట్టాలి భూసార పరీక్షలపై అవగాహన చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ

మద్నూర్‌(జుక్కల్‌): మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పను లను, కస్తూర్భా పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈ నాగేశ్వర్‌ రావు అన్నారు. గురువారం ఆయన ఆయా నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లాలోని మద్నూర్‌, నిజామాబాద్‌ జిల్లాలోని పోతంగల్‌లో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సంతోష్‌ మేసీ్త్ర ఉన్నారు.

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఏవో కిషన్‌ మట్టి సమూనాలు సేకరించి భూసార పరీక్ష వాటి ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ప్రణాళికతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా ప్రభుత్వ మానసిక వైద్యాధికారి రమణ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్‌ పాఠశాలలో గురువారం వైద్య ఆరోగ్య, ఎకై ్సజ్‌ శాఖల ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం–మాదకద్రవ్యాల నిరోధం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆ రోగ్యం ఎంతో కీలకమన్నారు. ఎకై ్సజ్‌ ఎస్సై వి క్రమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని కృంగిపోవద్దని, జీవితంలో సాధించాల్సింది చాలా ఉందని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. జిల్లా సోషల్‌ వర్కర్‌ రాహుల్‌ మాట్లాడుతూ.. మానసిక సమస్యలు ఉంటే టెలి మానస్‌ 14416కు, డ్రగ్స్‌ సమాచారంపై 14446 నంబర్‌లకు సంప్రదించాలని కోరారు. ప్రిన్సిపల్‌ మాధవి, ఎకై ్సజ్‌ సిబ్బంది దేవా, రఘు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: హైదరాబాద్‌లో ఇటీవల ని ర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. క్రీడాకారులు వివిధ విభాగాల్లో బంగారు, కాంస్య పతకాలు సాధించినట్టు కార్యదర్శి రాజ య్య, కోచ్‌ డీకొండ సాత్విక్‌ తెలిపారు. బంగారు పతకాలను నహీరా, అర్ఫాత్‌, హన్సికా సాధించారన్నారు. వెండి, కాంస్య పతకాలు సాధించిన వారిలో రీతన్య, తహ్వికా, మోక్షజ్ఞ, చెర్వికా, శ్రియాన్ష్‌లున్నారు. క్రీడాకారులను ప లువురు అభినందించారు.

పనులు నాణ్యతగా చేపట్టాలి 
1
1/3

పనులు నాణ్యతగా చేపట్టాలి

పనులు నాణ్యతగా చేపట్టాలి 
2
2/3

పనులు నాణ్యతగా చేపట్టాలి

పనులు నాణ్యతగా చేపట్టాలి 
3
3/3

పనులు నాణ్యతగా చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement