మహిళా చైతన్యం!
బల్దియాలు, వార్డుల వారీగా ఓటర్ల వివరాలు..
బల్దియాలవారీగా మహిళా అభ్యర్థుల వివరాలు..
● 447 మంది అభ్యర్థుల్లో
236 మంది వనితలే..
● రిజర్వ్ వార్డులతోపాటు జనరల్
స్థానాల్లోనూ బరిలో పలువురు
రాజకీయాలపై మహిళల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రజాప్రతినిధి కావడం కోసం ఎన్నికల బరిలోనూ నిలుస్తున్నారు. రిజర్వ్ అయిన స్థానాల్లోనే కాకుండా జనరల్ వార్డుల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలలో సగానికన్నా ఎక్కువమంది అభ్యర్థులు మహిళలే ఉండడం గమనార్హం.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించిన తర్వాత వారి ప్రాతినిధ్యం పెరిగింది. దీంతో రాజకీయ చైతన్యమూ పెరుగుతూ వస్తోంది. మహిళకు రిజర్వు అయిన స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ నిలబడి సత్తా చాటుతున్నారు. 50 శాతం రిజర్వేషన్ అవకాశం రావడంతో వారికి కేటాయించిన స్థానాల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో బరిలో దిగుతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో 92 వార్డులు ఉండగా 45 వార్డులను మహిళలు రిజర్వు అయ్యాయి. అన్ని వార్డుల్లో కలిపి మొత్తం 447 మంది బరిలో ఉన్నారు. ఇందులో 236 మంది మహిళలు ఉన్నారు.
పలు వార్డుల్లో బహుముఖ పోటీ..
మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ప్రధాన పార్టీలనుంచే కాకుండా స్వతంత్రులుగానూ చాలామంది పోటీ చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని 5, 13, 40, 41 వార్డులలో ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. 7, 23, 27, 28, 35 వార్డుల్లో ఆరుగురు చొప్పున, 16, 21, 22, 30, 38, 42, 48 వార్డులలో ఐదుగురు చొప్పున పోటీపడుతున్నా రు. బాన్సువాడలోని 7, 17 వార్డుల్లో ఆరుగురు చొప్పున 6, 8, 14 వార్డుల్లో ఐదుగురు చొప్పున మహిళలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బి చ్కుందలోని మూడో వార్డులో ఏడుగు రు, 11వ వార్డులో ఐదుగు రు, 12వ వార్డులో ఆరుగురు, ఎల్లారెడ్డిలోని 1, 2 వార్డుల్లో ఐదుగురు చొప్పున మహిళలు పోటీ చేస్తున్నారు.
మహిళ లకు రిజర్వు అయిన స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ పలువురు పోటీ పడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో 3, 31, 45 వార్డులలో ఇద్దరు చొప్పున, 9, 19, 24, 25, 26, 32, 36, 49 వార్డులలో ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచారు. ఎల్లారెడ్డిలో 9, 15 వార్డులలో ఒక్కొక్కరు, బిచ్కుంద ఒకటో వార్డులో ఇద్దరు, ఆరో వార్డులో ఒకరు పోటీ చేస్తున్నారు.
మున్సిపాలిటీ వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
కామారెడ్డి 49 48,389 50,907 17 99,313
ఎల్లారెడ్డి 12 6,321 6,943 01 13,265
బాన్సువాడ 19 11,578 12,599 11 24,188
బిచ్కుంద 12 6,201 6,556 02 12,759
మొత్తం 92 72,489 77,005 31 1,49,525
మున్సిపాలిటీ వార్డులు మొత్తం అభ్యర్థులు మహిళలు
కామారెడ్డి 49 254 137
ఎల్లారెడ్డి 12 45 23
బాన్సువాడ 19 85 45
బిచ్కుంద 12 63 31
మొత్తం 92 447 236


