అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

అమ్మవ

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఎల్లారెడ్డిని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తా

దోమకొండ: మండలంలోని అంబారిపేట గ్రామంలో పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్‌ అరుట్ల కవిత దంపతులు గురువారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో అర్చకులు ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం మహిళలు ఓడిబియ్యం పోశారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఉపసర్పంచ్‌ సత్తగౌడ్‌, ముదిరాజ్‌ సంఘం ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డిని మోడల్‌ సిటీగా అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. ఎల్లారెడ్డిలోని 7,8, 12వ వార్డులలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ను కై వసం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే ఎల్లారెడ్డి అభివృద్ధి జరిగిందన్నారు. పార్టీ అభ్యర్థులు భాగ్యవతి, శ్రీనివాస్‌, దశరథం, సోసైటీ వైస్‌ చైర్మెన్‌ ప్రశాంత్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు తదితరులున్నారు.

వినూత్న ప్రచారం

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో టెక్నాలజీ తోడైంది. తాజాగా పుర వీధుల్లో ’డిజిటల్‌ వాకింగ్‌ బోర్డులు’ సందడి చేస్తున్నాయి. ప్రచారకర్తలు తమ వీపునకు ఎల్‌ఈడీ లైటింగ్‌ బోర్డులను తగిలించుకుని వార్డుల్లో కలియతిరుగుతున్నారు. చీకటిలోనూ అభ్యర్థి ఫోటో, గుర్తు తళతళలాడుతూ కనిపిస్తుండటంతో అటుగా వెళ్లేవారు ఆగి మరీ చూస్తున్నారు. ఫ్లెక్సీల కంటే ఈ ’లైటింగ్‌’ ప్రచారం ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ, ఓటర్లకు రీచ్‌ ఎక్కువగా ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని 37వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి గురువారం రాత్రి ఈ వినూత్న ప్రచారం చేపట్టాడు.

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
1
1/2

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ
2
2/2

అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement