మొక్కులు చెల్లించుకున్న కాచాపూర్ ప్రజాప్రతినిధులు
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిదులు బుధవారం సమ్మక్క సారక్కలకు ముడుపులు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్, ఉప సర్పంచ్ బైండ్ల దశరథం, మాజీ సర్పంచ్‌లు బైండ్ల భూపతి, యాదయ్యలతో పాటు నేతలు డాక్టర్ రాజిరెడ్డి, జీవన్‌రెడ్డి, భూమయ్య, తొగరి మురళి, వార్డు సభ్యుడు తొగరి రమేష్‌లు మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని గ్రామాన్ని సుభిక్షంగా ఉంచమని వేడుకున్నారు. గ్రామాన్ని అభివృద్థి పథంలో నడిపించుమని కోరుతూ అమ్మవార్లకు కట్నకానుకలతో పాటు రూ.21వేల విలువచేసే బెల్లంను సమర్పించుకున్నారు.


