చెట్టును ఢీకొన్న డీసీఎం
గాంధారి(ఎల్లారెడ్డి): డీసీఎం వ్యాన్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో డ్రైవర్‌కు గాయాలైన ఘటన గండివేట్ స్టేజీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగ్లూర్‌కు చెందిన డీసీఎం వ్యాన్ గాంధారి నుంచి బాన్సువాడ వైపు వెళ్తోంది. డ్రైవర్ రాందాస్ అజాగ్రత్తగా నడపటంతో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును అతి వేగంగా ఢీకొట్టింది. డీసీఎం క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాగా, డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు బయటకు తీసి 108 అంబులెన్సులో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.


