ఉపాధి పనులపై సామాజిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

Feb 5 2026 7:24 AM | Updated on Feb 5 2026 7:24 AM

ఉపాధి

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనులపై స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో బుధవారం సామాజిక గ్రామ సభ ఏర్పాటు చేసి ఏపీడీ వామన్‌రావు, ఎంపీడీవో రాజేశ్వర్‌, ఏపీవో మధు సమీక్షించారు. 2024–25లో జరిగిన 45 గ్రామ పంచాయతీల పరిధుల్లో సామాజిక తనిఖీలు చేశారు. అన్ని గ్రామాల్లో సామాజిక తనిఖీలు, గ్రామసభలు పూర్తయ్యాయి. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధి పనుల పరిశీలన

లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి, లింగంపేట గ్రామాల్లో బుధవారం ఎంపీడీవో నరేశ్‌ ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడారు. పనులు కొలతల ప్రకారం చేయాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో నరేందర్‌, క్షేత్రసహాయకులు, తదితరులు ఉన్నారు.

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
1
1/1

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement