కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
● ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
ఎల్లారెడ్డిరూరల్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట, హరిజన వాడ, 5వ, 6వ వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం వల్ల అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యదిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పార్టీ అభ్యర్థులు స్వప్న, గఫార్, చంద్రయ్య తదితరులున్నారు.


