ఉపాధి హామీ కూలీల సంఖ్య గణనీయంగా పెంచాలి
బాన్సువాడ రూరల్: గ్రామాల్లో ఉపాధి హామీ ప నులకు వచ్చే కూలీల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లపై ఉందని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ అన్నారు. బుధవారం ఆయన మండల కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి సత్యనారాయణరెడ్డితో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఉ పాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి ప లు సూచనలు చేశారు. వేసవి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని పంచాయ తీ కార్యదర్శులకు ఆదేశించారు. అలాగే గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఇంకా పనులు ప్రారంభించని వారిని గుర్తించి వారు వెంటనే పనులు ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు.


