క్రీడలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ఉల్లాసం

Feb 6 2026 7:55 AM | Updated on Feb 6 2026 7:55 AM

క్రీడ

క్రీడలతో మానసిక ఉల్లాసం

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

శివానగర్‌లో ముగిసిన నియోజకవర్గ సీఎం కప్‌ పోటీలు

ఎల్లారెడ్డి: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని శివానగర్‌లో నిర్వహించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ సీఎం కప్‌ పోటీలు గురువారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో యువకులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. డీఎల్‌పీవో సురేందర్‌, క్రీడాకారులు తదితరులున్నారు.

ఖోఖో విజేత పాల్వంచ

కామారెడ్డి అర్బన్‌: పట్టణంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ స్థాయి సీఎం కప్‌ పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో ఖోఖో బాలికల విభాగంలో విన్నర్‌గా పాల్వంచ, రన్నర్‌గా కామారెడ్డి (గర్గుల్‌జట్టు), బాలుర విభాగంలో విన్నర్‌గా పాల్వంచ, రన్నర్‌గా బీబీపేట, కబడ్డీ బాలికల విభాగంలో విన్నర్‌గా కామారెడ్డి అర్బన్‌, రన్నర్‌గా పాల్వంచ, బాలుర విభాగంలో విన్నర్‌గా మాచారెడ్డి, రన్నర్‌గా భిక్కనూర్‌ మండలాలు నిలిచాయి. విజేతలకు జిల్లా యువజన క్రీడాల శాఖాధికారి వెంకటేశ్వర్లు, ఎస్జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి హీరాలాల్‌, అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌లు బహుమతులు అందజేశారు.

మాచారెడ్డి: పాల్వంచ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు నియోజకవర్గ సీఎం కప్‌ ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చారు. ఈసందర్భంగా జట్లను హెచ్‌ఎం గోవర్ధన్‌రెడ్డి అభినందించారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం 1
1/1

క్రీడలతో మానసిక ఉల్లాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement