ఎనిమిదేళ్ల బాలుడికి పెద్ద కష్టం
రామారెడ్డి: తెలిసి తెలియని వయసులో కన్నీళ్లు పెట్టుకుంటూ తండ్రికి తలకొరివి పెట్టిన చిన్నారిని చూసి అంత్యక్రియలకు హా జరైన కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల కళ్లు చెమ్మగిల్లాయి. బుధవారం రామారెడ్డి గ్రామానికి చెందిన కాటంరవి విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు, భార్య ఉన్నారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించగా పెద్దకొడుకు అఖిల్ తండ్రికి తలకొరివి పెట్టాడు. గ్రామంలోని రైతులకు పొలం, ఇళ్లలోని విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తూ అందరితో కలివిడిగా ఉండే రవి హఠాత్తుగా మృతి చెందడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎనిమిదేళ్ల బాలుడికి పెద్ద కష్టం


