పిన్న వయసులో ఎన్నికల బరిలో.. | - | Sakshi
Sakshi News home page

పిన్న వయసులో ఎన్నికల బరిలో..

Feb 6 2026 7:11 AM | Updated on Feb 6 2026 7:11 AM

పిన్న

పిన్న వయసులో ఎన్నికల బరిలో..

జిల్లాలో యువతరం రాజకీయాల్లోకి వస్తోంది. మహిళలూ ముందుంటున్నారు. పాతికేళ్లలోపు మహిళా అభ్యర్థులు పలువురు మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచారు.

● కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డునుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా రాంశెట్టి హర్షిత పోటీ చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఎన్నికల బరిలో నిలిచిన ఆమె వయసు 22 ఏళ్లు.. 32వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న గ్యార అఖిల వయసు కూడా 22 ఏళ్లే. ఆమె డిగ్రీ పూర్తి చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 5వ వార్డునుంచి బీజేపీ అభ్యర్థిగా 22 ఏళ్ల స్నేహ పోటీ చేస్తున్నారు. 27వ వార్డులో సీపీఎం అభ్యర్థిగా తోట అలేఖ్య (25), 41వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రాపల్లి నవ్య(26) పోటీ పడుతున్నారు.

● ఎల్లారెడ్డిలోని రెండో వార్డులో బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సమీరా బేగం వయసు 23 ఏళ్లు.

● బాన్సువాడ ఏడో వార్డునుంచి 24 ఏళ్ల మానస (బీజేపీ అభ్యర్థి), ఆరో వార్డు నుంచి 25 ఏళ్ల హీనా ఫాతిమా (కాంగ్రెస్‌ అభ్యర్థి) అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

● బిచ్కుందలో 12వ వార్డునుంచి 24 ఏళ్ల రూప బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా, ఆరో వార్డునుంచి 25 ఏళ్ల రాథోడ్‌ సునీత (25) బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

పిన్న వయసులో ఎన్నికల బరిలో..1
1/2

పిన్న వయసులో ఎన్నికల బరిలో..

పిన్న వయసులో ఎన్నికల బరిలో..2
2/2

పిన్న వయసులో ఎన్నికల బరిలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement