పురుగుమందుల వినియోగం తగ్గించాలి
నస్రుల్లాబాద్: రైతులు పురుగు మందుల వినియోగం తగ్గించాలని ఏవో భవాని అన్నారు. మండలంలోని మిర్జాపూర్, నెమ్లి గ్రామాల్లో గురువారం వరి పొలాలను ఆమె పరిశీలించారు. రైతులు సహజ ఎరువులను వాడాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో పర్టిలైజర్ షాపులను స్టాక్ రిజిస్టార్‌లను,మందులను పరిశీలించారు. ఆమె వెంట రైతులు ఉన్నారు.
కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి
మద్నూర్(జుక్కల్): శనగ, మొక్కజొన్న, జొన్న పంటలో కత్తెర పురుగును గమనించినట్లు ఏవో రాజు తెలిపారు. మండలంలోని అవాల్‌గావ్ శివారులో పంటలను గురువారం ఏవో రాజు పరిశీలించారు. యాసంగిలో సాగు చేస్తున్న శనగ, మొక్క జోన్న పంటలకు ఆశించిన కత్తెర పురుగు నివారణకు చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. నివారణ కోసం 80 గ్రాముల ఇమమెక్టిన్ బేంజాయేట్ లేదా క్లోరాంట్రినిప్రోల్ 60 మిల్లీ లీటర్ల మందును ఒక లీటర్ వేప నూనేలో కలిపి ఎకరా పంటకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. యాసంగిలో సాగు చేస్తున్న పంటలను ఆయా గ్రామాల ఏఈవోల దగ్గర నమోదు చేసుకోవాలన్నారు. ఏఈవోలు సంపత్, సౌమ్య, ఎఫ్‌పీవో చైర్మెన్ గోపాల్ ఉన్నారు.
పురుగుమందుల వినియోగం తగ్గించాలి


